Shopping Cart 0 items - $0.00 0

పాన్ ఇండియా మేనియా

బాహుబలి’ ఏ ముహూర్తాన బహుభాషల్లో విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు తిరగరాసిందో కానీ..  అప్పటినుంచి దాదాపు అన్ని భాషల హీరోలూ.. తాము కూడా అదే తరహా లో పాన్ ఇండియా కేటగిరిలో సినిమా తీసి.. తమ మార్కెట్ పరిధిని విస్తరించుకోవాలని తెగ ఆరాట పడుతున్నారు.. ఆ ప్రయత్నంలో కొన్ని సినిమాలు సక్సెస్ చవిచూడగా.. కొందరు హీరోలు .. చేదు అనుభవాన్ని రుచిచూశారు. అయినా సరే.. ఇంకా పలు భాషల్లో నుంచి పలువురు హీరోలు పాన్ ఇండియా పాన్ ఇండియా అని కలవరించడం మానలేదు.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘సాహో’

ప్రపంచాన్ని ఉర్రూతలూపే రేంజ్ లో బాహుబలి సక్సెస్ అవగా.. ప్రభాస్ కు అదే రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. దాంతో .. అతడి తదుపరి చిత్రం ‘సాహో’ కూడా ‘అదే రేంజ్ లో పాన్ ఇండియా కేటగిరిలో విడుదలై..  కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఒక బాలీవుడ్ లో తప్ప.. మిగిలిన అన్ని భాషల్లోనూ సాహో చిత్రం అభిమానుల్ని నిరాశపరిచింది. తద్వారా డిస్ట్రి బ్యూటర్స్ కూ నష్టాలు తప్పలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ తదుపరి చిత్రం కూడా పాన్ ఇండియా కేటగిరిలో  నిర్ల్మాణం జరుపుకుంటోంది. జిల్  రాధాకృష్ణ దర్శకత్వంలో  ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమా  త్వరలోనే విడుదల కానుంది. 

కన్నడ యంగ్ హీరో ‘యశ్ ‘కేజీఎఫ్’ సంచలనం

బాహుబలి అఖండ విజయంతో .. శాండిల్ వుడ్ లో కూడా పాన్ ఇండియా సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే దాని కోసం అతడు .. బడా హీరోల జోలికి మాత్రం పోలేదు. ఇప్పుడిప్పుడే కన్నడ రంగంలో హీరోగా నిలదొక్కుకుంటున్న యశ్ తోనే సినిమా తీయాలని ఫిక్సయ్యాడు. యశ్ హీరో అవడంతో కేజీఎఫ్ చిత్రం మీద ప్రేక్షకుల్లో అంతగా అంచనాలు కలగలేదు. కట్ చేస్తే సినిమా అన్ని భాషల్లోనూ దుమ్మురేపే కలెక్షన్స్ తెచ్చుకుని ఇండియన్ స్ర్కీన్ కే షాకిచ్చింది. ఇప్పుడు దానికన్నా అధిక బడ్జెట్ తో ‘కేజీఎఫ్ 2’ చిత్రం పాన్ ఇండియా కేటగిరిలో రాబోతోంది. అంతేకాదు .. బాలీవుడ్ నుంచి అధిక సంఖ్యలో నటీనటుల్ని ఈ సినిమా కోసం దర్శకుడు ఎంపిక చేయడం విశేషం.

మెగాస్టార్ మొదటి పాన్ ఇండియా ప్రయత్నం ‘సైరా నరసింహారెడ్డి’

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ చిత్రం ఖైదీనెంబర్ 150 తో రూ. 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించడంతో ..ఆ ధైర్యంతోనే  మెగా తనయుడు  రామ్ చరణ్ ఆయనతో పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేయగలిగాడు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ‘సైరా నరసింహారెడ్డి అనే ఫిక్షనల్ హిస్టారిక్ మూవీ నిర్మించాడు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకొని మెగాభిమానుల్ని సంతోషపరిచింది.  కానీ ఇతర భాషల్లో మాత్రం చిత్రం బయ్యర్స్ కు నష్టాల్నే మిగిల్చింది.  

పాన్ ఇండియా కేటగిరిలో మలయాళ ‘మామాంగం’

తెలుగు , కన్నడ భాషల్లో  పాన్ ఇండియా చిత్రాలు సూపర్ హిట్టవడంతో .. టెక్నికల్ గానూ, కథల పరంగానూ  అన్నిభాషలవారి కన్నా ఎప్పుడూ అడ్వాన్స్ డ్ గా ఉండే మలయాళ చిత్ర పరిశ్రమకూ పాన్ ఇండియా ఆలోచన వచ్చింది. అయితే ఇక్కడే మలయాళ దర్శకుడు పద్మకుమార్ తప్పటడుగు వేశాడు. పాన్ ఇండియా సినిమా కోసం  యూనివర్సల్ సబ్జెక్ట్ తీసుకోకుండా.. లోకల్ స్టోరీని ప్రిఫర్ చేయడంతో ‘మామాంగం’ చిత్రం  మిగతా భాషల ప్రేక్షకులకు  ఆ స్టోరీ  నాన్ సింక్ అయింది. దాంతో సినిమా ఘోర పరాజయం పాలైంది. అయితే ఈ సినిమా మలయాళంలో కూడా సేమ్ రిజల్ట్ తెచ్చుకోవడం గమనార్హం.

దగ్గుబాటి రానా పాన్ ఇండియా సినిమా ‘అరణ్య’

బాహుబలి చిత్రంతో ప్రభాస్ తో పాటు తానూ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. ఆ క్రెడిట్ తో రానా  పలు భాషల్లో వరుస చిత్రాలు చేసుకుంటూ.. తన కెరీర్ ను పక్కాగా బిల్డ్ చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో .. రానా ప్రస్తుతం ‘అరణ్య’ అనే ఒక జంగిల్ కాన్సెప్ట్ మూవీ తో పాన్ ఇండియా లెవెల్లో రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒరిజిల్ వెర్షన్ హిందీ. ‘హాథీ మేరే సాథీ’ గా విడుదలవుతోన్న ఈ సినిమా తమిళంలో ‘కాడన్’ గా వస్తోంది. అలాగే.. మలయాళంలో సైతం ఈ సినిమా విడుదలవుతుందని సమాచారం. అడవుల్లో  ఏనుగుల తో సావాసం చేసే.. ఒక యువకుడు జనావాసంలోకి వస్తే జరిగే పరిణామాలు .ఈ సినిమా ఇతి వృత్తం.

పవన్, క్రిష్ పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో కమ్ బ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వకీల్ సాబ్ ’తో పాటు .. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కూడా సెట్స్ మీదున్నాయి. దీనికి విరూపాక్ష అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని టాక్. మొఘాయిల కాలంలో రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి లేనివారికి పెట్టే ఒక బందిపోటు ముఠా నాయకుడిగా నటిస్తున్నాడట పవన్. యూనివర్సల్ అపీల్ ఉన్న ఈ సినిమాను పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకోసం పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ ను కేటాయిస్తున్నారు నిర్మాతలు.

కన్నడ నుంచి మరో సినిమా కబ్జా

 

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర ఇప్పుడు పాన్ ఇండియా కేటగిరిలో ఒక సినిమా తో వస్తున్నాడు. కబ్జా అనే టైటిల్ ఖాయం చేసుకున్న ఈ సినిమాకి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ‌సిద్ధేశ్వ‌ర ఎంట‌క్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ల‌గ‌డ‌పాటిశ్రీ‌ధ‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని ఆర్ . చంద్ర‌శేఖ‌ర్‌, రాజ్‌ ప్ర‌భాక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైద‌రాబాద్‌లో  లాంఛ‌నంగా ప్రారంభమయింది. 1947-80 ల మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఓ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నిక‌ల్‌గానూ పాన్ ఇండియా స్థాయిలో  బహుభాషల్లో  ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇంకా మరికొందరు హీరోలు.. ఈ ఏడాది పాన్ ఇండియా కేటగిరిలో భారీ బడ్జెట్ చిత్రాలతో బహు భాషల్లో సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. మరి అందులో ఎవరెవరు సక్సెస్ అందుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తారో చూడాలి. 

 

 

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!