సెన్సార్ నియమాలు..  కొన్ని సందర్బాల్లో కొన్ని సినిమాలకు చాలా ఇబ్బందిగా మారతాయి. సెన్సార్ .. ఒక సినిమా ఫస్ట్ కాపీ వచ్చాకా జరుగుతుంది కాబట్టి..  సినిమా డైలాగ్స్ లో కానీ, సీన్స్ లో కానీ.. లేదా పాటల్లో కానీ.. ఏమైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు  సినిమా విడుదలకు ముందు మార్చడం చాలా కాష్టం గా మారుతుంది.  డైలాగ్స్ అయితే.. ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు .. కానీ రికార్డింగ్ అయిపోయి, చిత్రీకరణ కూడా కంప్లీట్ అయిన పాటలకు సెన్సార్ చేయాల్సి వచ్చినప్పుడు మరీ చికాకుగా తయారవుతుంది వ్యవహారం.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన దొరబాటు సినిమాలోని ఒక పాట విషయంలో ఇదే సమస్య ఎదరైంది. అందులో ‘‘రా రా పడకింటికి’’ అని ఒక పాట ఉంది. అక్కినేని, మలయాళ హీరోయిన్ విజయశ్రీ మీద ఆ పాట చిత్రీకరణ జరిగింది. ఇది ఓ ఐటమ్ తరహా సాంగ్ ..  విడుదలకి ముందు సెన్సార్ వారు ఆ పాట  చూశారు. ‘పడకింటికి’ అనే పదాన్ని  కట్‌ చెయ్యాలన్నారు. చరణంలోని ఇంకో రెండు లైన్లు కూడా మార్చాలని ఆదేశించారు. ‘పడకింటికి’ అన్నది ‘పొదరింటికి’ అని మార్చారు సి.నా.రె . ఈ పల్లవీ, చరణంలోని రెండులైనులూ తిరిగి ఘంటసాల చేత పాడించాలి. కానీ, ఆయన ఆరోగ్యం బాగులేదు. ఆసుపత్రిలో ఉన్నారు. ఏం చెయ్యాలి? అప్పుడు  రామకృష్ణ చేత పల్లవి తిరిగి రాసిన లైనులను పాడించారు. తక్కినది ఘంటసాలదే ఉంచారు. పాటవింటే, రెండు వేర్వేరు కంఠాలు వినిపిస్తాయి. వినడానికి కాస్తంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

 

Leave a comment

error: Content is protected !!