Shopping Cart 0 items - $0.00 0

న్యూ లుక్ : భక్తవత్సలం నాయుడు గా మోహన్ బాబు

‘గాయత్రి’ తర్వాత.. తెలుగులో మరే చిత్రంలోనూ నటించలేదు విలక్షణ నటుడు మోహన్ బాబు. కానీ ప్రస్తుతం తమిళంలో మాత్రం ఆయన ఒక సినిమాలో నటిస్తున్నాడు. సూర్య హీరోగా నటిస్తోన్న ‘సూరారై పోట్రు’ చిత్రంలో ఆయన ఒక పెక్యులర్ పాత్ర పోషిస్తున్నాడు.  ఆ  పాత్ర పేరు భక్తవత్సలం నాయుడు.  ఆయన ఒరిజినల్ పేరునే ‘ఆకాశమే  నీహద్దురా’ పేరుతో వస్తోన్న  తెలుగు వెర్షన్ కి వాడుకోవడం విశేషం. గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులోని మోహన్ బాబు లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

పైలట్ గా నటిస్తోన్న సూర్య పాత్రకు మెంటార్ గా మోహన్ బాబు కనిపించనున్నారు. క్లీన్ షేవ్డ్  ఫేస్ కట్ తో , ఎరోనాటికల్ విభాగంలోని ఒక ఆఫీసర్ గా  రివీలైన ఆయన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీ.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న  ఈ చిత్రం మోహన్ బాబుకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!