తెలుగు రియాల్టీ షోస్ లో అత్యధిక పాపులారిటీ తెచ్చుకున్న షో బిగ్ బాస్ . మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని.. ఇప్పుడు  నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది ఈ షో. కరోనా కారణంగా అసలు బిగ్ బాస్ నాలుగో సీజన్ ఉంటుందా ఉండదా అనే సందేహాలు తలెత్తాయి. కంటెస్టెంట్స్ దాదాపు100 రోజాల పాటు పాల్గొనాల్సి ఉండడంతో.. కరోనా వ్యాపించే అవకాశాలున్నాయని ఇప్పటివరకూ షోను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడప్పుడే  ఆ  గొడవ తేలకపోవడంతో .. తగు జాగ్రత్తలు తీసుకొని , కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ.. బిగ్ బాస్ -4 కు రంగం సిద్ధం చేసేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతోంది.

బిగ్ బాస్ .. మూడో సీజన్ లో ఎంతో స్టైలిష్ గా హోస్టింగ్ చేసిన అక్కినేని నాగార్జునే  సీజన్ 4 కి కూడా హోస్ట్ గా రానున్నారు. ఇటీవల నాగ్ .. ఓల్డ్ గెటప్ లో బిగ్ బాస్ ప్రొమో లో కనిపించగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. లాస్టియర్ షో లో కంటెస్టెంట్స్ అందరూ  ప్రేక్షకుల్ని  ఎంతగానో ఎంటర్ టైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ మరింతగా షోను రక్తి కట్టించనున్నారట. ఈ నేపథ్యంలో జనంలో ఎంతో క్రేజ్ ఉన్న అన్ని వర్గాలకు చెందిన ఫేమస్ పెర్సనాలిటీస్ ను సీజన్ 4 కోసం ప్రత్యేకంగా ఎంపికచేశారు.  ఈ తరుణంలో షోలో పాల్గొనబోయే 16 మంది పేర్ల జాబితా లీక్ అయింది. ఈ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వార్తల ప్రకారం నందు (హీరో), అభిజిత్ (హీరో), మోనాల్ గుజ్జర్ (హీరోయిన్), కరాటే కళ్యాణి (కామెడీ నటి), సూర్యకిరణ్ (దర్శకుడు), సురేఖ వాణి (సహాయ నటి), అమ్మ రాజశేఖర్ (డాన్స్ మాస్టర్), ముక్కు అనినాష్ (జబర్దస్త్ ఫేం), లాస్య (యాంకర్), దేవి (టీవీ9 న్యూస్ ప్రజెంటర్), జోర్దార్ సుజాత (యాంకర్), తనూజ పుట్టస్వామి (స్మాల్ స్క్రీన్ నటి) పాల్గొనున్నారు.

నోయల్‌( నటుడు,సింగర్‌), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు), అరియానా గ్లోరీ (యాంకర్‌, జెమిని కెవ్వు కామెడీ యాంకర్) కూడా కంటెస్టెంట్స్ గా ఈ సీజన్ లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ లతో బాటు సోషల్ మీడియా పాపులర్ నటీ నటులను ఈ సీజన్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేత్తడి ఫేమ్ హారిక, బిత్తిరి సత్తి ప్రోగామ్స్ లో పాపులర్ అయిన గంగవ్వ, అరియానా గ్లోరీ, మెహబూబా దిల్‌ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో నిజమెంత తెలియాలంటే సాయంత్రం 6 గంటల వరకు వేచిచూడవలసిందే..!

Leave a comment

error: Content is protected !!