సినిమా షూటింగ్స్ ఔట్ డోర్ లో చేస్తే .. యూనిట్ కి జనంతో పెద్ద తలనొప్పి. అందులోనూ అభిమాన తారాగణంతో చేస్తే.. అది మరింత ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే అందరు దర్శకులూ.. వాళ్ళను కంట్రోల్ చేయడానికి పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తారు. అయితే సమయానికి పోలీసులు అందుబాటులో లేకపోతే వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి సిట్యేవేషన్ ప్రముఖ దర్శకుడు ఆదుర్తి దర్శకత్వం వహించిన నమ్మినబంటు విషయంలో జరిగింది. ఇది అరవైల్లో మాట. అప్పుడు కూడా సినీ యాక్టర్స్ అంటే జనంలో ఎంత క్రేజో అర్ధమవుతోంది.
‘నమ్మినబంటు’ సినిమాలోని ఒక దృశ్యం మద్రాసులోని మౌంట్‌రోడ్‌లో తియ్యవలసి వచ్చింది. మౌంట్‌రోడ్డంటే బాగా రద్దీగా ఉండే రోడ్డు. జనాన్నీ ట్రాఫిక్‌నీ అదుపు చెయ్యడానికి పోలీస్‌శాఖని కోరారు. అయితే, ఆ రోజు ఎవరో విదేశీయ అతిథి వస్తున్నారని, పోలీస్‌ని పంపలేమని చెప్పారు అధికారులు. అప్పుడు ఆదుర్తి, జూనీయర్ ఆర్టిస్టులని పిలిపించి, వాళ్లందరికీ పోలీస దుస్తులు వేయించి, ట్రాపిక్‌ని అదుపుచేయించారు. జనానికి వాళ్లు వేషగాళ్లని తెలియదగదా. సజావుగా షూటింగ్ జరిగిపోయింది! అబద్దపు పోలీసులతో. అయితే, అన్నపూర్ణా వారు ‘జైజవాన్’ తీసినప్పుడు హైదరాబాద్ గండిపేటలో ఉన్న ఆర్టిలరీ సెంటర్‌ని, అర్థిస్తే వాళ్లు నిజమైన సైనికుల్ని షూటింగ్‌కి పంపించారు. ఆ సినిమాలోని ‘పాలబుగ్గల చిన్నదాన్ని’ అనే పాటలో కనిపించే సైనికులందరూ నిజమైన సైనికులు!