యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ యమ జోరు మీదున్నాడు. నిన్నకాక మొన్ననే ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ప్రారంభించిన నిఖిల్ .. ఈ రోజు మరో సినిమాను మొదలుపెట్టేశాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై దర్శకుడు సూర్యప్రతాప్ కుమారి 21 ఎఫ్ తర్వాత తెరకెక్కించబోతున్న ఈ సినిమా కు ‘18పేజెస్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామ్యం వహించనుండడం విశేషంగా మారింది. గోపీ సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా కు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యహరిస్తున్నారు.
పూజా కార్యక్రమాలతో లాంచంగా ప్రారంభమైన ఈ సినిమా కు మరో హంగామా కూడా తోడైంది. అల్లు అర్జున్ గారాల పట్టి .. అర్హ ఈ సినిమా లాంచింగ్ వేడుకకు హైలైట్ గా నిలిచింది. తాత అల్లు అరవింద్ కు తన ముద్దు ముద్దు చేతులతో ముద్దిచ్చి.. ఆహూతుల్ని ఆహ్లాద పరిచింది. ఆ చిన్నారి చిట్టి చేతులతో తాత అరవింద్ క్లాప్ కొట్టించడం .. ఆమె ముద్దు మాటలకు మురిసిపోయి.. ఈమె మా ముఖ్య అతిథి అంటూ.. నిఖిల్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఆమె అల్లరిని వీడియో తీసి.. నిఖిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.