అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘ఆజాద్’. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన  ఈ దేశభక్తి చిత్రానికి దర్శకుడు తిరుపతి స్వామి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీద్ నిర్మించిన ఈ సినిమా 2000 లో విడుదలైంది. సరిగ్గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సౌందర్య, శిల్సశెట్టి కథానాయికలు గా నటించారు. కాగా.. సుజిత, ప్రకాశ్ రాజ్, రఘువరన్,  నూతన్ ప్రసాద్, రఘునాథరెడ్డి, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

రాజమండ్రి నుంచి హైద్రాబాద్ వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ అనే యువకుడు .. అనుకోకుండా.. ఒక  బాంబ్ బ్లాస్ట్ ను తప్పిస్తాడు. అలాగే.. కొన్ని ప్రమాదాల నుంచి కొంతమందిని కాపాడుతాడు. అయితే వాటిని ఆజాద్ అనే యువకుడే చేశాడనే పుకారు పుట్టిస్తుంది జర్నలిస్ట్ అంజలి. దాంతో ఆజాద్ అనేవాడు పబ్లిక్ లో హీరో అవుతాడు. చివరికి అంజలి సహాయంతో ఆ ఆజాద్ .. దేశాన్ని ఎలా కాపాడుతాడు అన్నదే మిగతా కథ. ఇదే కథ ఇన్స్పిరేషన్ తో తర్వాత .. తమిళంలో విజయ్ హీరోగా ‘వేలాయుధం’గా విడుదలైంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని అలరించాయి.

Leave a comment

error: Content is protected !!