యంగ్ హీరో నాగశౌర్య కు ‘ఊహల గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా మంచి బూస్టప్ నిచ్చాడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్. డైరెక్టర్ గా ఆయనకు అదే ఫస్ట్ మూవీ. చక్కటి ప్రేమ కథ, మంచి డైలాగ్స్ తో తెరకెక్కిన ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ క్రెడిట్ తోనే శౌర్యతో మళ్లీ ‘జ్యో అత్యుతానంద’ మూవీని తెరకెక్కించి దాని తో కూడా సక్సెస్ సాధించాడు అవసరాల. ఇప్పుడు వీరిద్దరి కాంబో మూడోసారి రిపీట్ కానుంది. అయితే ఈ సారి నాగశౌర్య కోసం ఓ వెరైటీ కథ ను రాసుకున్నాడట శ్రీనివాస్ అవసరాల.
నాగశౌర్య పాత్రలో ఏకంగా ఏడు షేడ్స్ ఉంటాయట. ఈ తరహా కథతో టాలీవుడ్ లో గతంలో ఏ సినిమా రాలేదని .. చెబుతున్నాడు నాగశౌర్య. ”ఇప్పటి వరకూ చాలా లవ్ స్టోరీలు చేశాను.కానీ అవసరాల శ్రీనివాస్ తో చేస్తున్న కథ మాత్రం చాలా వెరైటీగా ఉండబోతోంది. నా పాత్రలోనే ఏడు షేడ్స్ ఉంటాయి. మరో పదేళ్ల తరవాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా ఉంటుంది” అని చెబుతున్నాడు యంగ్ బోయ్ నాగశౌర్య. ‘అశ్వథ్థామ’ తర్వాత సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా ఆ ఇద్దరికీ హ్యాట్రిక్ అవుతుందేమో చూడాలి.