కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్ తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. అయితే ఒక మాజీ హీరోయిన్ మాత్రం వేరేలా స్పందించింది.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తన నియోజకవర్గంలో ఉన్న పేదలకు తన వంతు సాయం చేస్తుంది మాజీ హీరోయిన్ కమ్ ఎంపీ నవనీత్ కౌర్.మాస్కులు, నిత్యావసర వస్తువులు పంచిపెడుతూ ఉదారతని చాటుకుంది. అంతేకాక ప్రజలకి కరోనాపై అవగాహన కలిగేలా పలు సూచనలతో పాటు సలహాలు అందిస్తుంది. కరోనా అప్పుడప్పుడే విజృంభిస్తున్న సమయంలో పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలకు మొఖానికి మాస్క్ వేసుకొని హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది నవనీత్ కౌర్.
Member of Parliament, Former actress #NavneetKaur distributes masks, sanitizers and urges people to stay indoors. #StayHomeStaySafe pic.twitter.com/ZcqXrLdMN3
— BARaju (@baraju_SuperHit) April 1, 2020