మలయాళ , తెలుగు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నటుడు జాన్ కొట్టోలీ హైదరాబాద్ ప్రగతీనగర్ లో మంగళవారం ఉదయం కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ తో మరణం సంభవించినట్టు తెలుస్తోంది.
కేరళకు చెందిన జాన్ కొట్టోలీ తెలుగులో పలు వెబ్ సిరీస్ లోనూ మను, యుద్ధం శరణం, మహానటి, సమ్మోహనం, ఫలక్ నుమా దాస్ లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘ఫలక్ నుమా దాస్’ మూవీతో జాన్ తెలుగులో పలు అవకాశాలు తెచ్చుకున్నాడు. అలాగే గాడ్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న నానీ , సుధీర్ బాబు ‘వీ’ చిత్రం లో ఒక ముఖ్యపాత్ర కూడా పోషించాడు. జాన్ మృతిపట్ల పలువురు మలయాళ , తెలుగు నటీనటులు తమ సంతాపం వ్యక్తం చేశారు.