టాలీవుడ్ లో  విలక్షణ పాత్రలు పోషించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూములో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్స్ పై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.

సుమన్   ‘కంచుకవచం’  సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన జేపీ .. వెంకటేష్, దాసరి కాంబినేషన్‌లో వచ్చిన బ్రహ్మ పుత్రుడుతో మరింత పేరు తెచ్చుకున్నారు.  ప్రేమించుకుందా రా సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు జయప్రకాష్. ఆ సినిమాలో ఆయన నటన, డైలాగ్ తీరు ఎంతో ఆకట్టుకుంది. రాయలసీమ యాసలో జయ ప్రకాష్ మాట్లాడే తీరు మంత్ర ముగ్దుల్నీ చేస్తుంది. ఆ సినిమా తర్వాత జయ ప్రకాష్ చాలా సినిమాల్లో విలన్‌గా నటించారు. బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘సమరసింహారెడ్డి’ సినిమాలో మరో సారి రాయలసీమ యాసలో మాట్లాడుతూ విలన్‌గా విశ్వరూపం చూపించారు.  ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డ్ వచ్చింది. జయప్రకాశ్ రెడ్డి మృతికి తెలుగు చిత్ర  పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.

Leave a comment

error: Content is protected !!