‘మహానటి’ చిత్రంలోని  తన అసమాన నటనతో  తెలుగువారి మనసు దోచుకున్నాడు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. ఆ సినిమా తర్వాత అతడు నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగులో అనువాదమయ్యాయి. ఈ నేపథ్యంలో  మనోడు తమిళంలో నటిస్తోన్న ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లైయడిత్తాల్’ చిత్రం తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ పేరుతో రాబోతోంది.  తెలుగమ్మాయి రీతూ వర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి దేసింగ్ పెరియసామి దర్శకుడు. వయాకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసఫ్ ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తోన్న  ఈ సినిమాలోని ఒక మెలోడియస్ సాంగ్ విడుదలైంది.

మసలా కాఫీ సంగీత సారధ్యంలో కంపోజ్ అయిన గుండెగిల్లి అంటూ సాగే ఓ పాట ఇటీవల విడుదలై.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రోహిత్ పరిటాల పాడిన ఈ పాటను సామ్రాట్ నాయుడు, పూర్ణాచారి చెల్లూరి రాశారు. ఈ వీడియోసాంగ్ ను దుల్కర్ సల్మాన్ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా విడుదల చేశాడు. త్వరలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘కనులు కనులను దోచాయంటే’.. చిత్రం ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

వీడియో సాంగ్ కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=DWJZFKI2lEQ&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!