కొందరు కథానాయికలు అందంతో అలరించడానికి  పుడతారు. మరికొందరు అందమైన అభినయం కోసమే పుడతారు. ఇంకొకరు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ.. ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటారు. ఈ వర్గానికి చెందిన కథానాయికే జయచిత్ర. తెలుగు తమిళ భాషల్లో 200లకు పైగానే చిత్రాల్లో నటించి .. తన ప్రత్యేకతను చాటుకుంది.

పాదుకా పట్టాభిషేకం సినిమాలో చిన్నప్పటి సీతగా, భక్తపోతన సినిమాలో పోతన కుమార్తెగా, జీవితం సినిమాలో శోభన్‌బాబు కూతురుగా నటించారు జయచిత్ర . ఈమె మద్రాసులో విద్యోదయా స్కూలులో పదవ తరగతి వరకు చదివింది. ఈమె చిన్నతనం నుండే వళువూర్ రామయ్య పిళ్ళె, వెంపటి చినసత్యం, ఎమ్‌.ఎస్.శైవా లవద్ద నృత్యాన్ని అభ్యసించింది. ఒకవైపు చదువుకుంటూనే తమిళచిత్రాలలో నటిస్తూ వచ్చింది. తరువాత సోగ్గాడు చిత్రంతో తెలుగు సినిమాలలో కథానాయికగా నటప్రస్థానాన్ని ప్రారంభించింది. తమిళనాడు ప్రభుత్వం ఈమెకు కళైమామణి పురస్కారం ఇచ్చి సత్కరించింది.

చిల్లరకొట్టు చిట్టెమ్మ, సోగ్గాడు, ఆత్మీయుడు, మాదైవం, ముత్తైదువ, వయసు పిలిచింది , సావాసగాళ్ళు లాంటి చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించింది. నిన్నటి తరం హీరోలకు, అత్తగానూ, అమ్మగానూ నటించి మెప్పించిన జయచిత్ర గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నేడు జయచిత్ర పుట్టిన రోజు.ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!