కరోనా ప్రపంచ దేశాల్ని గజగజ వణికిస్తోంది. ఆ మహమ్మారి నెమ్మదిగా ఇండియాకి కూడా పాకి.. ఇక్కడ జనాన్ని కూడా భయ భ్రాంతులకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే.  ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.  లాక్ డౌన్ ను విధించి ఇంట్లోనే ఉండేలా కట్టడి చేశారు.  అభివృద్ధి, ఇతర పరిపాలన విషయాలను పక్కన పెట్టి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి నిధులు ఖర్చు చేస్తున్నారు.   ఇక విపత్తులు సంభవించినపుడు ముందుకు వచ్చి సహాయసహకారాలు అందించే తెలుగు సినిమా  పరిశ్రమ ఈ విషయంలోనూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తోంది. 

ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు సహాయాన్ని ప్రకటించారు.  పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే తెలుగు రాష్ట్రాలకు, కేంద్రానికి తన వంతు సహాయం ప్రకటించారు.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్నేహితుడు, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  తనవంతు సహాయం అందుంచేందుకు ముందుకు వచ్చారు.  తెలుగు రాష్ట్రాలకు కరోనా సహాయం కింద రూ.20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.  ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 

 

Leave a comment

error: Content is protected !!