జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజుంది. ఈ ఫ్రాంచైజీ లో ఇప్పటికి 24 సినిమాలు విడుదలయ్యాయి. కాగా ఇప్పుడు 25వ చిత్రం ముస్తాబవుతోంది. డానియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 12న యూ.కె లోనూ, నవంబర్ 25 న యూ.యస్.ఏ లోనూ విడుదల కానుంది. అయితే ఇంగ్లీష్‌తో పాటు ఇండియాలో నవంబర్‌ 25న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో  ప్రతినాయకుడు సఫీన్‌గా రామి మాలెక్‌ నటిస్తున్నాడు. ఇయాన్ ప్రొడక్షన్స్, మెట్రో-గోల్డ్విన్-మేయర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మైఖేల్ జి.విల్సన్, బార్బరా బ్రోకలీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చిత్రం కోవిడ్‌-19తో వాయిదా పడింది. చిత్రంలో లాషనా లించ్, బెన్ విషా, నవోమి హారిస్, జెఫ్రీ రైట్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, రాల్ఫ్ ఫియన్నెస్ తదితర నటులు నటిస్తున్నారు. మొత్తం మీద కరోనా వైరస్‌ సినిమా విడుదలతో పాటు, సినిమాలోనే తనతో సమానామైన వైరస్‌ పాత్రను కూడా చేర్చగలిగింది. చిత్రానికి సంబంధించిన కొత్త ట్రైలర్ సెప్టెంబర్‌ 3న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!