లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో సహాయపడుతున్నారు. అందులో భాగంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు రాజమౌళికి ఓ ఛాలెంజ్‌ విసిరారు. రాజమౌళి ఎన్టీఆర్ – చరణ్ లకు ‘బి ది రియల్ మేన్’  ఛాలెంజ్ విసిరాడు. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన తారక్.. టాలీవుడ్ సూపర్ సీనియర్లైన చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – బాలయ్యల తో పాటు దర్శకుడు కొరటాల శివను ఛాలెంజ్ చేశాడు.
ఇందులో భాగంగా ఛాలెంజ్‌ని స్వీక‌రించిన కొర‌టాల శివ .. ఛాలెంజ్ స్వీక‌రించాను తార‌క్ అన్న‌య్య‌. ఇప్ప‌టికే నెల రోజు ఫూటేజ్ మిస్ అయింద‌ని చ‌మ‌త్క‌రించాడు. తను ఇంట్లో చేసిన పనులతో కూడిన వీడియో ను ట్విట్టర్ లో పో్స్ట్ చేసిన కొరటాల .. తర్వాత విజయదేవరకొండకు ఛాలెంజ్ విసిరాడు.

 

Leave a comment

error: Content is protected !!