Shopping Cart 0 items - $0.00 0

తప్పు జరిగితే ‘వీ’ డు నిజంగా వస్తాడు

నేచురల్ స్టార్ నానీ, వర్ధమాన హీరో సుధీర్ బాబు, నివేదా థామస్ , అదితీరావు హైదరీ ప్రధాన పాత్రల్లో ఇంద్ర గంటి మోహన్ కృష్ణ సంధిస్తోన్న యాక్షన్ అస్త్రం ‘వీ’. శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా లో నానీ నెగటివ్ రోల్ ప్లే చేస్తూండడం ఆసక్తి రేపుతోంది.  పోలీసాఫీసర్ గా సుధీర్ బాబు నటిస్తూండగా.. అతడిని ముప్పుతిప్పలు పెట్టిన మూడు చెరువుల నీళ్ళు తాగించే కిల్లర్ గా నానీ చెలరేగనున్నాడట.

ఈ రోజు ‘వీ’ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సుధీర్ బాబు తన ట్విట్టర్ అకౌంట్లో. ‘తప్పుజరిగితే యముడొస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం’. అంటూ ఒక పిస్టల్ తో తాను దేనికో గురిపెడుతున్న  స్టిల్ తో  ఒక  కేప్షన్  రాసి పోస్టర్ ను పోస్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు.   

Leave a comment

error: Content is protected !!