మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ‘ఖైదీనంబర్ 150, సైరా’ చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ పై ప్రస్తుతం తండ్రి చిరంజీవితోనే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఇదే బ్యానర్ పై మలయాళ ‘లూసిఫర్’ రీమక్ కూడా త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లే సన్నాహాల్లో ఉన్నాడు. అంతేకాదు ఇప్పుడు అదే బ్యానర్ పై మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ కూడా షురూ చేసే ఆలోచనలో ఉన్నాడు చెర్రీ. ఆ మేరకు ఆ సినిమా రైట్స్ కూడా చెర్రీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోగా మెగాస్టార్ కాకుండా వేరే స్టార్ ను హీరోగా ఎంపిక చేసే ప్రయత్నంలో చరణ్ ఉన్నాడు. ముందుగా శర్వానంద్ ను ఒక ఆప్షన్ గా అనుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘డ్రైవింగ్ లైసెన్స్’ లో హీరోగా విక్టరీ వెంకటేశ్ అయితే మరింత బెటరని చెర్రీ ఆలోచిస్తున్నాడట.
ఒక సూపర్ స్టార్ కు, అతడి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన వెహికల్ ఇన్స్ పెక్టర్ కు మధ్య జరిగే ఇగో క్లాష్ కథాంశంతో తెరకెక్కిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది. నటుడు లాల్ కొడుకు లాల్ జూనియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా .. తెలుగు లో రీమేక్ అయితే.. సూపర్ స్టార్ పాత్రకు వెంకటేశ్ అయితేనే కన్విన్సింగ్ గా ఉంటుందని రామ్ చరణ్ భావిస్తున్నాడట. ప్రస్తుతం వెంకీ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నారప్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాకా.. అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ కి షిఫ్ట్ అవుతాడు. అన్నీ కుదిరితే.. ఈ సినిమా తర్వాత ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా కోసం రెడీ అవుతాడని వినికిడి. ఈ ఏడాది చివరిలో కానీ.. వచ్చే ఏడాది కానీ.. కొణిదెల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుందని టాక్. మరి వెంకీ స్ర్కీన్ ప్రెజెన్స్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ కు ఏ మేరకు అడ్వాంటేజ్అవుతుందో చూడాలి.