ఎవరి సినిమాలోని హీరో కేరక్టరైజేషన్ ..  ప్రేక్షకులకి  దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ చేస్తుందో ఆ డైరెక్టరే పూరీ జగన్నాథ్.  హీరోల పాత్రల్ని  మాసీ గా చెక్కే మోడ్రన్ శిల్పి పూరీ. హీరోయిన్స్ ను కేవలం డ్యాన్సింగ్ డాల్స్ గా కాకుండా.. పెర్ఫార్మెన్స్ ప్రిన్సెస్ గా మార్చే బ్రిలియన్సీ ఆయన సొంతం. ఎంత పాపులర్ తిట్టు .. సినిమాకి టైటిల్ గా పెడితే.. ఆ సినిమా అంత  హిట్టు అనే సెంటిమెంట్ కూడా ఆయన్నుంచే వచ్చింది. ‘ఇడియట్, పోకిరి, దేశముదురు, రోగ్, లోఫర్’ లాంటి తిట్లు  టైటిల్స్ గా మారి .. పూరీ జగన్నాథ్ వల్లనే పబ్లిక్ లో ఫేమస్ అయ్యాయి. ఆయన సినిమాలోని హీరోలందరూ.. మామూలు సినిమాల్లోని హీరోలకన్నా రెండాకులు ఎక్కువే చదివి ఉంటారు. అదేనండీ.. బిహేవియర్ లోనూ, తలపొగరులోనూ.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వద్ద సహాయకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు పూరీ .రాంగోపాల్‌ వర్మకు సహాయకుడిగా ఎన్నో సినిమాలకు పని చేశాడు. హీరో రవితేజకు పూరి మంచి స్నేహితుడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్‌’ తదితర చిత్రాలు  రవితేజకి స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. కన్నడ పవర్ స్టార్  పునీత్‌ రాజ్‌ కుమార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు పూరీ. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తో కూడా వర్క్‌ చేసిన ఘనత ఈ డైరెక్టర్‌ సొంతం. పవన్‌ కళ్యాణ్,  ‘బద్రి’ సినిమాతో డైరెక్టర్‌గా తెరకు పరిచయమయ్యాడు పూరీ జగన్నాథ్. ఆ ఏడాదే జగపతిబాబు హీరోగా ‘బాచి’ చిత్రాన్ని తెరకెక్కించాడు.  తెలుగులో హిట్టయిన పవన్‌ కళ్యాణ్‌ సినిమా ‘తమ్ముడు’ కన్నడ రీమేక్‌ ‘యువరాజ’ మూవీకి దర్శకత్వం వహించాడు. ఆ తరువాత రవితేజతోనే ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ రూపొందించాడు.   నాగ్‌ తో ‘శివమణి’ , వెంటనే జూనియర్‌ ఎన్టీఆర్‌తో ‘ఆంధ్రావాలా’ సినిమాని కూడా రూపొందించాడు. ఆ తరువాత ‘బద్రి’ సినిమా హిందీ రీమేక్‌తో బిజీ అయ్యాడు పూరీ. .   ‘పోకిరి’ సినిమా దుబాయ్‌లోని 7వ ఐఫా సినిమా వేడుకలలో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఎన్నో భాషలలోకి రీమేక్‌ చేశారు. దాంతో ఒక్కసారిగా పూరికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2004లో ‘బద్రి’ సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు పూరి. 2011లో ‘బుడ్డా హోగా తేరా బాప్‌’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, హేమామాలిని వంటి అగ్ర నటీనటులు నటించారు. ఈ సినిమా ఆస్కార్‌ లైబ్రరీలో స్థానం సంపాదించుకోగలిగింది. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘కెమెరా మ్యాన్‌ గంగతో రాంబాబు’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రోమియో’, ‘జ్యోతిలక్ష్మి’, ‘లోఫర్‌’, ‘ఇజం’, ‘రోగ్‌’, ‘పైసా వసూల్‌’, ‘మెహబూబా’, చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు ఈ డైరెక్టర్‌. ‘మెహబూబా’ సినిమాలో పూరి కుమారుడు ఆకాష్‌ హీరోగా నటించారు. ఇటీవలే రామ్‌ పోతినేనితో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!