Shopping Cart 0 items - $0.00 0

డబ్బు భలే జబ్బు

ప్రముఖ రచయిత , నటుడు , వ్యాఖ్యాత, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు సినీ కెరీర్ లో మరపురాని చిత్రం ‘డబ్బు భలే జబ్బు’. గొల్లపూడికి, రావుగోపాలరావు కు సమానంగా పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. దేన్నయినా డబ్బుతో కొనేయొచ్చు అనే యాటిట్యూడ్ తో ఒకరు, అన్నిటినీ డబ్బుతో కొనలేం. ముఖ్యంగా బంధాల్ని, బాంధవ్యాల్ని డబ్బుతో ముడిపెడితే.. మానవ సంబంధాలు మిగలవు అనే సిద్ధాంతంతో మరొకరు. ఈ ఇద్దరూ స్నేహితులే.  వారి వారి అనుభవాలు నేర్పిన గుణ పాఠాల సారంశమే  చిత్ర కథ. కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో 1992లో విడుదలైన ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. ప్రధాన పాత్రల్ని గొల్లపూడి మారుతీరావు , రావుగోపాలరావు పోషించగా.. అన్నపూర్ణ, అచ్యుత్ , మహర్షి రాఘవ, వరలక్ష్మి, హరిత ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సుమలత, రాజా జంటగా నటించారు. నిజానికి ఈ సినిమా తమిళంలో విసు దర్శకత్వం లో వచ్చిన ‘వరవు నల్ల ఉరవు’ చిత్రానికి రీమేక్ వెర్షన్ . ఇదే చిత్రం ఆ తర్వాత మలయాళంలో ‘అచ్చన్ కొంబత్తు అమ్మ వరంబత్తు’గా రీమేక్ అయి అక్కడ కూడా ఘన విజయం సాధించింది.  వాస్తవానికి ఈ సినిమా  1937లో వచ్చిన హాీలీవుడ్ మూవీ ‘మేక్ వే ఫర్ టుమారో ’చిత్రానికి ఆధారం. 

Leave a comment

error: Content is protected !!