Shopping Cart 0 items - $0.00 0

డబుల్ హ్యాట్రిక్ కు రెడీ అవుతోన్న పూజా హెగ్డే

 

‘అల..  వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ తో కథానాయిక పూజా హెగ్డే.. టాలీవుడ్  టాప్ చెయిర్ ను హస్తగతం చేసుకుందని వేరే చెప్పాలా? త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ , బన్నీ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ కు, పూజా అందం , అభినయం కూడా తోడై.. ఆ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా ఆ మూవీలోని బన్నీ, పూజా ల రొమాంటిక్ ట్రాక్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఘనవిజయంతో అమ్మడు హ్యాట్రిక్ నే దాటేసి .. మిగతా హీరోయిన్స్ కు  గట్టి పోటీగా నిలిచింది.

బిఫోర్ లాస్టియర్ యన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీతో మొదలు పెట్టిన పూజా విజయాల దండయాత్ర.. ‘అల..వైకుంఠపురములో’ వరకూ కొనసాగడం విశేషం. 2019 లో పూజా బేబ్ .. ‘మహర్షి, గద్దలకొండ గణేశ్’ చిత్రాలతో పాటు .. ’హౌస్ ఫుల్ 4’ హిందీ చిత్రంతో కలుపుకొని హ్యాట్రిక్ హిట్స్ కైవసం చేసుకుంటే.. ఈ ఏడాది అల… ఘన విజయంతో శుభారంభం చేసింది. మొత్తం మీద పూజా హెగ్డే ఎలా చూసుకున్నా.. హ్యాట్రిక్ హిట్స్ ను దాటుకొని.. డబుల్ హ్యాట్రిక్ కు రెడీ అవుతూండడం విశేషమని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ జాన్ మూవీలో కథానాయికగా నటిస్తోన్న పూజా హెగ్డే ..  ఈ ఏడాది మరిన్ని హిట్స్ అందుకొని డబుల్ హ్యాట్రిక్ ఫీట్ సాధిస్తుందేమో  చూడాలి. 

Leave a comment

error: Content is protected !!