Shopping Cart 0 items - $0.00 0

ట్రైలర్ టాక్ : యాక్షన్ లో ‘తడాఖా’ చూపించిన టైగర్ ష్రాఫ్

‘బాఘీ’ సిరీస్ తో బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా ఎదిగిన టైగర్ ష్రాఫ్ ..  ఇప్పుడు అదే ఫ్రాంచైజీలోని మూడోభాగంలోనూ తనదైన ట్రేడ్ మార్క్ యాక్షన్ తో వచ్చేస్తున్నాడు. తమిళంలో ఆర్య, మాధవన్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్టై’  ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. అదే సినిమా  టాలీవుడ్ లో  నాగచైతన్య, సునీల్  హీరోలుగా ‘తడాఖా’గా రీమేక్ అయి ఇక్కడా మంచి సక్సెస్ సాధించింది. అదే సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో ‘బాఘీ3’ గా రీమేక్ అవుతోంది. టైగర్ ష్రాఫ్, రితీష్ దేశ్ ముఖ్ అన్నదమ్ములుగా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్  ఈ రోజే విడుదలైంది. ట్రైలర్ ఫుల్ గా యాక్షన్ సీన్స్ తో నిండిపోవడం విశేషం.

అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా నిర్మాణంలో తెరకెక్కిన ‘బాఘీ3’ లో  శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది. కాగా.. ఇందులో దిశాపటానీ ఓ స్పెషల్ సాంగ్ లో తనదైన డ్యాన్స్ తో చెలరేగింది. మార్చ్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ‘బాఘీ 3’ మూవీ .. ‘వేట్టై’ సినిమాను యాజిటీజ్ దింపుతున్నా .. టైగర్ ష్రాఫ్ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ప్రధానంగా హైలైట్ కానున్నాయి. మరి  ఈ సినిమా కూడా గత రెండు భాగాల స్థాయిలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద  తడాఖా చూపిస్తుందేమో చూద్దాం.

బాఘీ3 ట్రైలర్ కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=qGT0ID_U73Q&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!