Shopping Cart 0 items - $0.00 0

ట్రైలర్ టాక్ : జ్నాపకాల పుస్తకం ‘జాను’

యంగ్ హీరో శర్వానంద్, అందాల సమంత జంటగా.. సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన పీరియాడికల్ లవ్ స్టోరీ జాను. తమిళ చిత్రం 96 రీమేక్ గా అదే దర్శకుడు మలిచిన ఈ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ మూవీ వచ్చేనెల 7న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. తమిళ సినిమాలోని అదే ఫీల్ ను తెలుగు వెర్షన్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దాదాపు 96 చిత్రీకరించిన లొకేషన్స్ లోనే జాను చిత్రాన్ని కూడా షూట్ చేయడం విశేషం.

ట్రైలర్ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫరైన శర్వానంద్ వాయిస్ మీద బిగిన్ అవుతుంది. ‘ఎగసపడే కెరటాల్లో ఎదురు చూసే సముద్రతీరాన్ని నేను.  పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా ఓరచూపు కోసం, నీ దోరనవ్వు కోసం , రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు ఓ చూపుఅప్పీయలేవా? అంటూ అద్భుతమైన భావంతో సాగుతుంది. ఆ తర్వాత శర్వానంద్ చదువుకున్న స్కూల్  రివీల్ అవుతుంది. అక్కడ తన చిన్ననాటి జ్నాపకాల్ని నెమరవేసుకుంటూ శర్వా స్కూల్ వైపు తదేకంగా చూస్తూ తనను తాను మరిచిపోతాడు.  ఆ తర్వాత చిన్నప్పటి జాను ఎంటరవుతుంది. చిన్ననాటి స్కూల్లోని సన్నివేశాలు వస్తాయి. ఆ తర్వాత ప్రజెంట్ లోని శర్వానంద్, సమంతా పాత్రల మీద సన్నివేశాలు వస్తాయి. ఆ తర్వాత వెన్నెల కిషోర్, రఘుబాబు పాత్రలు రివీల్ అవుతాయి. టోటల్ గా జాను చిత్రం అందరికీ అద్భుతమైన ఫీలింగ్ కలిగించే సినిమా కానుందని అర్ధమవుతోంది.  మరి ఈ సినిమా 96 స్థాయిలో విజయం అందుకుంటుందో లేదో చూడాలి.

ట్రైలర్ కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి 

https://www.youtube.com/watch?v=8sWRT2hGPcQ&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!