ఒకప్పటి సినిమాల్లోని సన్నివేశాల్లో అభ్యంతరంగా అనిపించిన  వాటిపై  సెన్సార్ వారు  చాలా కఠినంగా వ్యవహరించేవారు. దర్శక, నిర్మాతలు ఎంతగా కన్విన్స్ చేసినప్పటికీ ఒప్పుకొనేవారు కాదు. సీన్స్ లోనైనా, డైలాగ్స్ లోనైనా, పాటలోని పదాల్లో అయినా.. అభ్యంతర కరంగా అనిపించిన దుస్తుల విషయంలో అయినా.. వాటి మీద వేటు వేయడానికి  సెన్సార్ వారు కత్తెరతో రెడీగా ఉండేవారు.

అక్కినేని నాగేశ్వరరావు ,జమున జంటగా నటించిన అభ్యుదయ చిత్రం ‘నిరుపేదలు’  విషయంలో అప్పటి సెన్సార్ బోర్డ్ సభ్యులు ఆశ్చర్య కరమైన రీతిలో సెన్సార్ కట్ లు ఇచ్చి.. దర్శకుడు తాతినేని ప్రకాశరావును తీవ్రంగా నిరాశపరిచారట. ఆ సినిమాని  ఎలాంటి పాటలు, కమర్షియల్ అంశాలు లేకుండా.. చాలా సహజంగా తెరకెక్కించారు. పేరుకి తగ్గట్టుగానే నిరుపేదల జీవితాల మీద తీసిన సినిమా ఇది. అయితే అప్పటి పరిస్థితుల్ని బట్టి.. ఈ సినిమా కాస్తంత  కమ్యూనిస్ట్ భావాలతో ఉంటుందట. అందుకని వెయ్యి అడుగులు పైగానే ఫిల్మ్ ను కట్ చేసేశారట. అంతేకాదు.. ఆ సినిమాలోని ఒక సన్నేశంలో ఒక ట్రాపిక్ బోర్డ్ మీద కీప్ లెఫ్ట్ అని రాసుంటుందట. అది కమ్యూనిజాన్ని బాగా ఎలివేట్ చేస్తోందని ఆ సీన్ ను కూడా కత్తిరించి పడేశారట. అవండీ అప్పటి సెన్సార్ రూల్స్ .

 

Leave a comment

error: Content is protected !!