Shopping Cart 0 items - $0.00 0

టాలీవుడ్ పై కరోనా వైరస్ ప్రభావం

రోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ కరోనా మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. బాలీవుడ్ నుంచి అన్ని వుడ్స్ లోనూ దీని ప్రభావంతో సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అప్ సెట్ అయ్యాయి. అలాగే విడుదలలు కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో కరోనా  వైరస్ ఔట్ బ్రేక్ చాలా ఎఫెక్ట్ నిచ్చింది. 

ఇప్పటికే రానా ‘విరాట పర్వం’ , నాని, సుధీర్ బాబు వి, యశ్ కేజీఎఫ్ 2  చిత్రాలు విడుదల తేదీలు మార్చుకోగా.. చిరంజీవి కొరటాల చిత్రం, బాలయ్య బోయపాటి చిత్రం.. ఇంకా మరికొన్ని చిత్రాల షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. ఒక్క ప్రభాస్ చిత్రం మాత్రం విదేశాల్లో యథావిథిగా షూటింగ్ జరుపుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే కరోనా వైరస్  వల్ల యంగ్ హీరో నితిన్ పెళ్ళి సైతం కేన్సిల్ అయినట్టు వార్తలొస్తున్నాయి. దానికి తోడు థియేటర్స్ సైతం కొద్దిరోజులు మూత పడనుండడం వల్ల మొత్తంగా టాలీవుడ్ పరిశ్రమ అల్లకల్లోలంగా మారింది.  మరి దీని ప్రభావం నుంచి టాలీవుడ్ ఎప్పుడు బైట పడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!