‘జురాసిక్ పార్క్’ ను ఇష్టపడని హాలీవుడ్ సినీ ప్రేమికుడే ఉండడు. రాక్షసబల్లుల ఉగ్రరూపాన్ని మొత్తం రెండు భాగాల్లో  ప్రేక్షకుల కళ్ళకు కట్టిన మహా దర్శకుడు స్పీల్ బర్గ్ .. అదే ఫ్రాంచైసీలోని మూడో భాగాన్ని కూడా మొదలుపెట్టేశాడు. సినిమా పేరు ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’. ఈ సిరీస్ లో ఇదే చివరి చిత్రం కానుండడం విశేషం. కొలిన్ ట్రెవరో రాసిన కథతో గత రెండు భాగాల్ని మించి.. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్  ఉండబోతున్నాయని టాక్.

మొదటి భాగంలో నటించిన సామ్ నీల్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్ బ్లమ్ లు మూడో భాగంలో కూడా కంటిన్యూ అవుతున్నారు.  ఇటీవల జురాసిక్ వరల్డ్ డొమినియన్ షూటింగ్ ను మొదలుపెట్టారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానున్నఈ సినిమా ప్రపంచ ప్రేక్షకుల్ని ఇంకా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!