ఏ సినిమా ఎవరితో రాసిపెట్టి ఉంటుందో తెలియదు. ఏది ఎవరి చేతులనుంచి మిస్ అవుతుందో తెలియదు. సినీ రంగంలో అలా చేతులు మారిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక సినిమా ‘అగ్నిజ్వాల’. మోహన్ బాబు, నరేష్ హీరోలుగా నటించిన ఈ సినిమాకి బోయిన సుబ్బారావు దర్శకుడు. ఎయటీస్ లో విడుదలైన ఈ సినిమాలో నిజానికి హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, తమిళ హీరో విజయకాంత్ నటించాల్సింది. కథ రాసుకున్న బోయినసుబ్బారావు.. అప్పటికి ఇంకా హీరోల్ని ఎంపిక చేసుకోలేదట. కథను బట్టి ఇందులో ఎవరిని హీరోలుగా సెలెక్ట్ చేయాలని .. మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణని అడిగాడట. దానికి పరుచూరి చిరంజీవి, తమిళ హీరో విజయకాంత్ అయితే బాగుంటారని సూచించారట. దానికి దర్శకుడు కూడా ఓకే అనుకున్నాడట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఖరి నిమిషంలో అందులో హీరోలుగా మోహన్ బాబు, నరేశ్ ఎంపికయ్యారు. టాలీవుడ్ లో ఈ సినిమా బాగానే ఆడింది కానీ.. చిరు, విజయ్ కాంత్ నటించి ఉంటే ఇంకా బాగుండేదని అప్పట్లో అనుకొనేవారు.

Leave a comment

error: Content is protected !!