కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లోని కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రోజుకో అప్డేట్ అభిమానుల్ని ఊరిస్తూండగా.. వాటిలో ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈచిత్రం లో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడట. కొరటాల శివ ప్రపోసల్ కి అయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు వినికిడి. గతం లో యుద్దభూమి, ఖైదీ నెంబర్ 786, మంచి దొంగ, కొండవీటి దొంగ లాంటి చిత్రాల్లో మోహన్ బాబు చిరుకి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు.. కొరటాల మూవీ కోసం ప్రత్యర్ధులు గా తలపడనుండడం ఆసక్తి రేపుతోంది. దేవాదాయ శాఖ లోని అవినీతి పై ఒక యువకుడు సాగించే పోరాటం గా ఈ సినిమా తెరకెక్కు తుండగా.. అందులో మోహన్ బాబు ఒక రాజకీయ నాయకుడి గా నటించ నున్నాడట. మరి ఈ మూవీ లో ఆయన నటన ఎంత విలక్షణం గా ఉంటుందో చూడాలి

Leave a comment

error: Content is protected !!