Shopping Cart 0 items - $0.00 0

గోపీచంద్ ‘సీటీమార్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

‘చాణక్య’ తర్వాత గోపీచంద్ నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సీటీమార్ ’. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కొద్ది సేపటి  క్రితమే విడుదలైంది. గోపీచంద్ బ్లాక్ కేప్ పెట్టుకొని మెళ్ళో తగిలించుకొన్న విజిల్ ను  బొటన వేలితో పైకి లేపి స్టైలిష్ గా రివీలయ్యాడు. కబడ్డీ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గానూ, కథానాయిక తమన్నా తెలంగాణా మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గానూ నటించనుండడం ఆసక్తి రేపుతోంది.

స్పోర్ట్స్ డ్రామాతో పాటు మాస్ ఎలిమెంట్ప్ పుష్కలంగా ఉన్న‘సీటీమార్’ గోపీచంద్ కు మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉన్నారు. ‘గౌతమ్ నందా’ తర్వాత సంపత్ , గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమానే కాకుండా.. ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో  తమన్నా నటిస్తోన్న మరో చిత్రం కావడం ‘సీటీమార్’ ప్రత్యేకత .  మరి ఈ మూవీ గోపీచంద్ కు ఏ స్థాయిలో ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!