పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయిపోవడం అభిమానులకు ఏదో పండగ జరుపుకుంటున్నంత ఆనందంగా ఉంది . ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు చిత్రాల్ని పవర్ స్టార్ లైన్ లో పెట్టుకున్నాడు. అందులో రెండు మూవీస్ సెట్స్ మీదున్నాయి. వాటిలోని పవన్ పాత్రలు గతంలో ఎన్నడూ చేయనివి. పింక్ రీమేక్ లో మొట్టమొదటసారిగా లాయర్ గా నటిస్తోన్న పవర్ స్టార్ .. ఆ తర్వాత చేస్తోన్న క్రిష్ మూవీలో సైతం అతడి కెరీర్ లోనే ఒక ఎక్స్ క్లూజివ్ రోల్ బోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్.. ‘సైరా’లో మెగాస్టార్ చేసిన యోధుడి లాంటి పాత్రను చేస్తున్నాడట. దానికోసం పవన్ తొలిసారిగా పొడవైన జుట్టుతో .. కోరమీసాలతో గుర్రం పై కత్తి పట్టుకొని కదనరంగంలోకి దూకుతాడట. ఆ మేరకు ఆ పాత్రకు సంబంధించిన గెటప్ తాలూకా స్కెచెస్ పరిశీలించే పనిలో ఉన్నడట క్రిష్. పవర్ స్టార్ కెరీర్ లోనే ఇదొక వైవిధ్యమైన చిత్రం అవుతుందని చెబుతున్నారు. దీనికోసం ఒక పవర్ ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నారట. కొద్ది రోజుల్లోనే ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్. మరి ఈ హిస్టారిక్ ఫిక్షనల్ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఎలివేట్ అవుతుందో చూడాలి.