ఇండియన్ మైకేల్ జాక్సన్ గానూ, మాస్ డైరెక్టర్ గానూ పేరు ప్రఖ్యాతలు గడించిన ప్రభుదేవా .. ఇప్పుడు సౌత్ లో మాస్ హీరోగా ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా మనోడు హీరోగా ‘పొన్ మాణిక్యవేల్’ (తెలుగులో కృష్ణ మనోహర్ ఐపియస్) గా పవర్ పోలీస్ అవతారంలో రానున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రభుదేవా హీరో గా మరో మాస్ సినిమా తెరకెక్కుతోంది. సినిమా పేరు ‘భగీరా’.  అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఆల్రెడీ 70 శాతం
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను వేలెంటైన్స్ డే నాడు  విడుదల చేశారు మేకర్స్.

గుండు గెటప్ లో రివీలైన ప్రభుదేవా .. సీరియస్ లుక్ తో రక్తం ఓడుతున్న పోజు లో ఆకట్టుకుంటున్నాడు. అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా భరతన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. నోమోర్ వేలెంటైన్స్ డే అనే ట్యాగ్ లైన్ తో విడుదలైన ఈ పోస్టర్స్ సౌత్ జనాన్ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. మరి భగీరా గా ప్రభుదేవా ఏ స్థాయి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!