Shopping Cart 0 items - $0.00 0

క్రిష్ – పవన్ మూవీకి కీరవాణి సంగీతం

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీఎంట్రీ మూవీ అయిన బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఇదే కాకుండా పవన్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రిష్ డైరెక్షన్ లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నఈ సినిమా కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఫిల్మ్ వర్గాల వారి నుంచి వినిపిస్తోంది.

ఈ మూవీకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ యం.యం.  కీరవాణి సంగీతం అందించనున్నాడట. పీరియాడికల్ మూవీ కావడంతో .. ఈ సినిమాకి కీరవాణి అయితేనే సరైన న్యాయం చేస్తాడనిపించిందట క్రిష్ కి. ప్రస్తుతం కీరవాణి .. రాజమౌళి మెగా మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ కి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాను వచ్చేనెల్లో లాంఛ్ చేసి.. ‘పింక్’ రీమేక్ తో పాటే సైమల్ టేనియస్ గా పట్టాలెక్కిస్తారట. అలా అయితే పవర్ స్టార్ అభిమానులకు డబుల్ ట్రీట్ అన్నమాట.

 

Leave a comment

error: Content is protected !!