విభిన్నమైన పేరు.  పేరు కు తగ్గట్టే ఆయన ఆలోచనలు కూడా చాలా విలక్షణంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ..  ప్రతీసారీ కొత్తగా చేయాలనే తపన ఆయనచేత పలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయించింది. తీసినవి చాలా తక్కువ సినిమాలే అయినా..  రెండున్నరేళ్ళ దశాబ్దాల క్రితం ఆ దర్శకుడు .. తన ఆలోచనలతో  టాలీవుడ్లో ఒక కొత్తశకానికి నాంది పలికాడు. ఆ దర్శకుడి పేరు గీతా కృష్ణ. విపరీతమైన విషయ పరిజ్నానం కలిగిన ఈ దర్శకుడు వాస్తవ సంఘటనలకు దృశ్యరూపాన్నిచ్చి..  25 ఏళ్ళ తర్వాత చేయాల్సిన సినిమాల్ని .. 25 ఏళ్ళకు ముందే తీసేశారు. ఆయన దర్శకత్వం వహించిన  ఒకో సినిమా ఒకో నావల్ పాయింట్ ను టచ్ చేయడం విశేషం.

తూర్పుగోదావరి జిల్లా కడియం దగ్గర మాధవరాయుడి పాలెం గీతాకృష్ణ స్వగ్రామం. చిన్నప్పటి నుంచీ సినిమాల మీద ఆసక్తి ఉండడం గమనించిన ఆయన తండ్రి.. ఆయన్ను పూణే ఫిల్మ్ ఇన్స్ స్టిట్యూట్ లో జాయిన్ చేశారు. దర్శకత్వంలో కోర్స్ పూర్తి చేసిన వెంటనే..  కె.విశ్వనాథ్ దగ్గర అసోసియేట్ గా చేరారు గీతాకృష్ణ.  ఆయన  దగ్గర సాగరసంగమం, స్వాతిముత్యం, జననీజన్మభూమి చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు.విదేశీ చిత్రాలు చూసే అలవాటు ఉండడంతో గీతాకృష్ణ లో  కొత్త కొత్త ఆలోచనలు మొగ్గతొడిగేవి. వాటిని బేస్ చేసుకొని కథలు రాసుకోవడం మొదలు పెట్టాడు గీతాకృష్ణ. అందులో ఒక కథ బాగా నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు ఒక నిర్మాత. ఆయన పేరు డా.యం.గంగయ్య . ఆ సినిమా పేరు సంకీర్తన. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన ఆ సినిమాకు ఇళయరాజా సంగీతం తోడవడంతో .. సినిమా ఒక దృశ్యకావ్యమైంది. దీని తర్వాత కోకిల, సర్వర్ సుందరం గారి అబ్బాయి, ప్రియతమా, కీచురాళ్ళు లాంటి సినిమాలతో తనకో ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. గీతాకృష్ణ తెలుగులో ఆఖరుగా చేసిన చిత్రం కాఫీబార్. ప్రస్తుతం గీతాకృష్ణ  ఒక ఫిల్మ్ స్కూల్ స్థాపించి .. దాంతో పాటు ఫ్యాషన్ కోర్స్ కూడా అందిస్తున్నారు. నేడు గీతాకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ క్రియేటివ్ కింగ్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!