మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కలయికలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆచార్య’. దేవాదాయ శాఖలోని అక్రమాల్ని అడ్డుకొననే విక్రమార్కునిగా చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో..  ఆయన మరో ముఖ్యమైన పాత్రలో కూడా కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. అంతేకాదు చిరు యంగ్ ఏజ్ పాత్రను చరణ్ చేయబోతున్నాడని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను ఆగష్ట్ 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అదే డేట్లో గతంలో చిరు సూపర్ హిట్టు చిత్రం ‘కొదమసింహం’ విడుదలైంది. అంతేకాదండోయ్.. అప్పటికి ‘కొదమ సింహం’ విడుదలై.. 30 ఏళ్లు అవుతుంది.

‘కొదమ సింహం’ సెంటిమెంట్ తో రిలీజ్ డేట్ ను లాక్ చేసుకోబోతున్న ‘ఆచార్య’.. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తుందని కొరటాల నమ్మకంగా చెబుతున్నాడు. సోషల్ రిఫార్మర్ గా..  అవినీతిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసే ధీరోదాత్తమైన పాత్రలో చిరు నటిస్తోన్న ‘ఆచార్య’ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మరి ‘ఆచార్య’  గా చిరు ఏ రేంజ్ లో ‘కొదమసింహం’లా విరుచుకు పడతాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!