మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.  వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ మూవీ తర్వాత చెర్రీ ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. తాజా సమాచారం ప్రకారం చరణ్ ప్రదీప్ అనే కొత్త కుర్రోడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడట. ఆ మేరకు మెగాస్టార్ తోనూ, చెర్రీతోనూ కొన్ని డిస్కషన్స్ నడిచాయట. అంతేకాదు చిరు స్ర్కిప్ట్ లో  కొన్ని ఛేంజెస్ చెప్పారట. ఆ ప్రకారం స్ర్కిప్ట్ ను లాక్ చేసే పనిలో ఉన్నాడట ప్రదీప్.

అన్నీ అనుకున్నట్టే జరిగితే.. ఈ సినిమా ఆర్.ఆర్.ఆర్ చిత్రం కంప్లీట్ అయ్యే టైమ్ కు సెట్స్ మీదకు వెళుతుందట. రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గట్టు గా ఒక ఇన్నోవేటివ్ థాట్ తో ఈ సినిమా స్ర్కిప్ట్ రూపొందుతోందట. చరణ్ ఇంతకు ముందెన్నడూ చేయని ఒక రోల్ ను డిజైన్ చేశారట. కథ అద్భుతంగా సెట్ అయిందని.. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో , గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో ఈ మూవీ తెరకెక్కనుందని టాక్. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a comment

error: Content is protected !!