రీసెంట్ గా ‘భీష్మ’ చిత్రంతో సూపర్ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నితిన్ .  అదే ఉత్సాహంతో ఇప్పుడు తదుపరి చిత్రాల్ని ట్రాక్ ఎక్కించే పని పెట్టుకున్నాడు.  ఈ నేపథ్యంలో మనోడు బాలీవుడ్ సూపర్ హిట్టు చిత్రం, నేషనల్ అవార్డును కైవసం చేసుకున్న చిత్రమూ అయిన ‘అంధాధున్’  రీమేక్ వెర్షన్ ను ఈ రోజే లాంఛ్ చేసేశాడు.   ఎప్పటినుంచో ఈ సినిమా రీమేక్ లో నితిన్ నటిస్తున్నాడని వార్తలొస్తున్నా..  ఎట్టకేలకు ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ఇప్పుడు ముహూర్తం కుదిరింది.

ఆయుష్మాన్ ఖురానా , టబు, రాధికా ఆప్టే  ముఖ్యపాత్రల్లో నటించిన ‘అంధాధున్’ .. చిత్రం అద్భుతమైన థ్రిల్లింగ్ కాన్పెప్ట్ తో తెరకెక్కింది. ఒక ప్రముఖ వ్యక్తి మర్డర్ కు ప్రధాన సాక్షిగా నిలిచిన ఒక అంధ పియానో ప్లేయర్  .. ఆ సంఘటనకు ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే ‘అంధాధున్’ చిత్ర కథ. . శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు.  నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్  షూటింగ్ కు వెళ్ళనుంది. మరి ఈ మూవీ నితిన్  కు ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!