విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటించిన యాక్షన్ చిత్రాల్లో ‘కేడీ నంబర్ 1’ సినిమా చాలా ప్రత్యేకమైంది. దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దేవీవర ప్రసాద్ నిర్మాణంలో .. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జయసుధ కథానాయికగా నటించగా… కైకాల సత్యనారాయణ, మిక్కిలినేని, జగ్గయ్య, అంజలీదేవి, ప్రభాకరెడ్డి, ముక్కామల, మాడా, పి.జే.శర్మ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 1978లో విడుదలైన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. కె.వి.మహదేవన్ సంగీత సారధ్యంలోని పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

కృష్ణ తండ్రి.. పోలీస్ ఆఫీసర్ రామారావు దొంగనోట్ల కేసులో అరెస్ట్ అవుతాడు. తల్లి పిచ్చిదవుతుంది. దాంతో అతడు చిన్నతనం నుంచే గ్యాంగ్ స్టర్స్ తో చేతులుకలుపుతాడు. కేడీ నెంబర్ 1 గా మారతాడు. తన తండ్రిని జైలుకి పంపిన వారిని, ఆ దొంగనోట్ల మూలాలు కనుగొనడానికి ప్రయత్నిస్తుంటాడు. చివరికి తన తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించి తల్లి దండ్రుల్ని కలుసుకోవడమే మిగతా కథ. నిజానికి  ఈ సినిమా దస్ నెంబరీ హిందీ చిత్రానికి రీమేక్ వెర్షన్. మనోజ్ కుమార్, హేమమాలిని జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టైంది.

 

Leave a comment

error: Content is protected !!