అందమైన ముఖం.. అమాయకమైన చూపులు… చక్రాల్లాంటి కళ్ళు.. చిరునవ్వు చిగురించే పెదవులు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే టాలెంట్ ఆమె సొంతం. ఆమె పేరు కీర్తి సురేశ్ . తల్లి మేనక.. వెటరన్ మలయాళ హీరోయిన్.. తండ్రి సురేశ్.. మలయాళ చిత్ర నిర్మాత. చిన్నప్పటి నుంచి నటన గురించి.. మాట్లాడుకొనే ఇంట్లో పెరగడం వల్లనో ఏమో .. కీర్తి సురేష్ కు కూడా సినిమాల్లో నటించాలనే కోరిక , తపన కలిగాయి. దాని ఫలితంగా.. మలయాళ చిత్రాల్లో బాలనటిగా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రవేశించింది.
కీర్తి సురేశ్ ‘గీతాంజలి’ చిత్రంతో హీరోయిన్ గా మలయాళ సినీ రంగ ప్రవేశం చేసింది. అందులో గీత, అంజలి అనే ఇద్దరు కవల పిల్లలుగా నటించి మెప్పించింది. ఆ పై కొన్ని మలయాళ సినిమాల్లో నటించి.. ‘నేను శైలజ’తో టాలీవుడ్ లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాని నేనులోకల్ , పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా సరిగా ఆడకలేకపోయినా.. కీర్తిసురేశ్ .. ఆ తర్వాత విడదులైన ‘మహానటి’ సినిమాలోని అద్వితీయ మైన నటనతో జాతీయ అవార్డు అందుకొని .. తెలుగువారికి కీర్తి పతాకమైంది . సావిత్రి పాత్ర కు ప్రాణ ప్రతిష్ఠ చేసి .. తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం చిరంజీవి, మహేశ్ బాబు సినిమాల్లో నటిస్తోన్న కీర్తి సురేశ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.