‘ఆర్.ఎక్స్ 100’ సంచలన విజయంతో కథానాయిక పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హాట్ లేడీ అయిపోయింది. ఆ ఒక్క మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో ఎన్నో అవకాశాలు అమ్మడి తలుపు తట్టాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం పూర్తిగా ఫెయిలయింది. ‘ఆర్డీ ఎక్స్ లవ్ స్టోరీ’ డిజాస్టరైంది, ‘వెంకీ మామ’ లో ఆమె కేరక్టర్ తేలిపోయింది . ఫైనల్ గా లేటెస్ట్ ‘డిస్కోరాజా’లోనూ పాయల్ ప్రయత్నం వృధా అయింది. ఇప్పుడు ఒకే ఒక సినిమా ఆమెకు దిక్కయింది. దాదాపు 15నెలల క్రితం పాయల్ కథానాయికగా ‘సైబరాబాద్ పోలీస్’ అనే ఒక మూవీ సెట్స్ మీదకు వెళ్ళింది. గుణశేఖర్ శిష్యుడు పరన్ దీప్ దానికి దర్శకుడు. కానీ ఈ మూవీ చాలావరకూ చిత్రీకరణ జరుపుకొని కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.
రీసెంట్ గా ‘సైబరాబాద్’ పోలీస్ చిత్రాన్ని నిర్మాతలు తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్ళారు. సమాజంలోని చెడుని ఏరిపారేసే సిన్సియర్ పోలీసాఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ విజృంభించనుందట. ఆ సినిమాతో ఎలాగైనా మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. నిజానికి కాప్ పాత్ర చేయడానికి ముందుగా చాలా నెర్వెస్ ఫీలయిందట. కానీ ఆ పాత్ర చేయగా చేయగా.. ఎట్టకేలకు అందులో పెర్ఫెక్షన్ సాధించిందట. ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధమవుతోన్న ‘సైబరాబాద్ పోలీస్’ పాయల్ కెరీర్ ను ఏ స్థాయిలో మలుపు తిప్పుతుందో చూడాలి.