హాలీవుడ్ అందాల తార ఎంజెలీనా జోలీ అంటే కేవలం నటియే కాదు.. మానవత్వానికి ప్రతీక. ఆపద సమయాల్లో ఎన్నోమార్లు విరాళాలతో ఆదుకొన్న మానవతామూర్తి అని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ముప్పు సమయంలో ఎంజెలీనా జోలీ మానవతా హృదయం మరోసారి స్పందించింది. ఈ ముప్పు సమయంలో ఆకలితో అలమటించే పిల్లల కోసం భారీ విరాళాన్ని అందించింది. తాజాగా ఆమె ఇచ్చిన విరాళం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 100 కోట్ల చిన్నారులు ఆకలితో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులపై ఎంజెలీనా జోలీ స్పందిస్తూ.. ఈ వారం రోజుల్లో 100 కోట్లకు మందికిపైగా చిన్నారులు రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితుల్లో వారికి సంరక్షణ, పుష్టికరమైన ఆహారం కావాల్సి ఉంది. కేవలం అమెరికాలోనే 2 కోట్లకుపైగా చిన్నారులకు సరైనా ఆహారం అందించాల్సిన అవసరం ఏర్పడింది అని ఎంజెలీనా చెప్పారు.

 పుష్టికరమైన ఆహారాన్ని అందిందుకు కరోనావైరస్ సృష్టించిన భయంకరమైన పరిస్థితుల నుంచి చిన్నారులను కాపాడేందుకు బిల్లీ షోర్ నిర్వహిస్తున్న నో కిడ్ హంగ్రీ  అనే సంస్థ విశేషమైన కృషి చేస్తున్నది. చాలామంది చిన్నారులకు సరైన సంరక్షణ, పుష్టికరమైన ఆహారాన్ని అందించే చర్యలు తీసుకొంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఎంజెలీనా ఓ ప్రకటనలో తెలిపారు. 7.5 కోట్ల విరాళం ప్రపంచవాప్తంగా  కొవిడ్19 వైరస్ బారిన పడిన చిన్నారులను ఆదుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఆర్థిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకొన్నాం. అందుకోసం నా వంతుగా 1 మిలియన్ డాలర్ మొత్తాన్ని ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాను. నా వంతుగా నో కిడ్ హంగ్రీ  సంస్థ ద్వారా  చిన్నారులకు సహాయం అందించాలనుకొంటున్నాను అని ఎంజెలీనా తెలిపారు. హాలీవుడ్ ప్రముఖుల భారీ విరాళం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న దారుణ పరిస్థితులపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు స్పందించారు.

 

Leave a comment

error: Content is protected !!