కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. తాజాగా ఈ లిస్ట్ లోకి దర్శకుడు హరీశ్ శంకర్ కూడా చేరాడు. అయితే ఆయన సహాయం విరాళాల రూపంలో చేయలేదు.

హరీష్ శంకర్ ఇటీవల  తన పుట్టిన రోజు సందర్భంగా ఒక స్వచ్ఛంద  సంస్థకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలను అందించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.  స్వీట్స్.. స్నాక్స్.. డ్రై ఫ్రూట్స్.. కేక్స్ కూడా అందించాడట.  ఈ సంస్థలో 45 మంది పిల్లలుఉన్నారట. అంతేకాదు ఈ సంస్థ చేసిన థాంక్స్ ట్వీట్ కు స్పందించిన హరీష్ “హోమ్ లోనే ఉండండి .. జాగ్రత్తగా ఉండండి” అంటూ రిప్లై ఇచ్చారు. హరీష్ చేసిన సాయానికి చాలామంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. నిజానికి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది ప్రముఖులు తమ విరాళం గురించి బహిరంగంగా చెప్పుకోరు. అందులో హరీశ్ శంకర్ కూడా ఒకరు.

Leave a comment

error: Content is protected !!