కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పైగా వ్యాపించి ఇప్పుడు ఇండియాలోనూ తిష్టవేసుకు కూర్చున్న సంగతి తెలిసిందే.  దాంతో  ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్ల విరాళం ఇవ్వగా, చిరంజీవి రూ.1 కోటి, పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లుఅర్జున్ కోటి 25 లక్షలు, బాలయ్య రూ.1.25 లక్షలు  విరాళం ఇచ్చారు. తాజాగా సీనియర్ టాప్ హీరో మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు  రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి సహాయ నిధికి  రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

అలాగే ఆయన పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా  రూ. రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు. ఇక ఆయన  శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పింది. కాబట్టి మొత్తం రూ. 10 లక్షల విరాళాన్ని ఈరోజుప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది.

Leave a comment

error: Content is protected !!