ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు తమిళనటీనటులు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాయం చేస్తున్నారు.
తాజాగా తమిళ అగ్ర నటుడు అజిత్.. తన వంతుగా రూ. 1 కోటి 25 లక్షల విరాళం ప్రకటించారు. అందులో ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు మరియు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.
#BREAKING : Actor #Thala #Ajith has donated the following amounts for #coronavirusinindia relief..
PM Cares Fund: Rs 50 lakhs
CM Relief Fund: Rs 50 lakhs
FEFSI: Rs 25 lakhsHuge respect for his noble gesture!
— Ramesh Bala (@rameshlaus) April 7, 2020