నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మైలురాయి లాంటి సినిమా ‘ఆదిత్య 369’. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. టైమ్ మెషీన్ కథాంశంతో 500 ఏళ్ళు ముందుకి, 500 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతినిచ్చిన ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ రాసుకున్నాకా.. అందులో కృష్ణ కుమార్ అనే యువకుడి పాత్రను ముందుగా కమల్ హాసన్ తో చేయించాలని దర్శకుడితో సహా అందరూ అనుకున్నారట. శ్రీకృష్ణ దేవరాయలు పాత్రకు మరెవరూ ఆప్షన్ లేదు కాబట్టి.. ఆ పాత్రకు బాలకృష్ణ అనే ఫిక్స్ అయ్యారట. అయితే కమల్ కు వేరే కమిట్ మెంట్స్ ఉండడంతో ..రెండు పాత్రల్నీ బాలయ్యే పోషించి.. ఘన విజయం సాధించారు. ఒక వేళ కమల్ హాసన్ గానీ నటించిన ఉంటే.. ఆ మల్టీస్టారర్ ఇంకెలా ఉండేదో .