హెడ్డింగ్ ను చూసి..  ఏనాటి కమల్ హాసన్?   ఎక్కడ రాశి ?  అని ఆశ్చర్యపోతున్నారా?   సినీ ఇండస్ట్రీలో జరిగిపోయిన కొన్ని సంఘటనలు .. చాలా ఏళ్ళ తర్వాత గుర్తుకు తెచ్చుకుంటే.. చాలా తమాషా గా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. అసలు మేటర్లోకొస్తే..  కథానాయిక రాశి .. బాలనటిగా  చాలా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అలా ఒక హిందీ సినిమాలో ఆమె .. కమల్ హాసన్ చిన్నప్పటి పాత్రలో నటించింది. సినిమా పేరు ‘గిరఫ్తార్’ . ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే..  ఇందులో అమితాబ్, కమల్ , రజనీకాంత్ లు ముగ్గురూ హీరోలుగా నటించారు. ఇందులో ఒక సన్నివేశంలో కమల్ చిన్నప్పుడు తండ్రి  చనిపోతాడు. ఆ సమయంలో ఆ పాత్ర తన తల్లిని పట్టుకొని ఉండాలి. అయితే ఆ సన్నివేశంలో రాశి .. తన తల్లి కనిపించలేదని ఏడ్చేసిందట. దాంతో రాశి నిజం తల్లే ఆ సన్నివేశంలో నటించాల్సి వచ్చిందట. మొత్తం మీద రాశి చిన్నతనంలోనే తన తల్లితో సహా నటించి మెప్పించిందన్నమాట.  

Leave a comment

error: Content is protected !!