ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ ఎవెటైడ్ మూవీ ఏదంటే.. అందరూ దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ పేరునే చెబుతారు. ముందుగా అనుకున్న డేట్ లో కాకుండా జనవరి 8, 2021కు చిత్ర బృందం రిలీజ్ డేట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినా సరే.. సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో సెన్సేషన్ సృష్టించాలని, కాస్తంత ఎక్కువ టైమ్ తీసుకొని మరీ తీవ్రంగా శ్రమిస్తున్నాడట. దాని కోసం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకూ తారక్ గానూ, చెర్రీగానీ వేరే ఇతర ప్రాజెక్ట్స్ కేసి కన్నెత్తి కూడా చూడకూడదనే షరతు విధించాడట.
రాజమౌళి మేటర్ ను ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నాడంటే.. ఈ మధ్య యన్టీఆర్, చరణ్ ఇద్దరూ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో పాల్గొంటూనే .. మరో పక్క వేరే ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతున్నారని వార్తలొచ్చాయి. అందుకే జక్కన్న వాళ్ళిద్దరినీ కండీషన్స్ అప్లై అంటూ అలా కట్టడి చేశాడని సమాచారం. సో మొత్తానికి దర్శకధీరుడి కన్నుసన్నల్లో ఆ స్టార్ హీరోలిద్దరూ మెలుగుతూ.. సంక్రాంతి వరకూ లాక్ అవ్వాల్సిందే అంటున్నారు. జక్కన్నా మజాకా.