భవ్య క్రియేషన్స్‌ పతాకం పై విశ్వంత్‌, సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ‘. బ్రహ్మాజీ కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించగా, వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు.

రేపు మార్చి 6న ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రం ప్రివ్యూ చూసి, యూనిట్ సభ్యుల్ని ప్రత్యేకం గా అభినందించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘’ ఓ పిట్ట కథ చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. ఊహించని ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్ గా ఉంది. దర్శకుడు చెందు ముద్దు స్క్రీన్ ప్లే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బ్రహ్మాజీ గారి అబ్బాయి సంజయ్ మొదటి చిత్రం లా కాకుండా చాలా బాగా నటించారు, విశ్వంత్ క్యారెక్టర్ అస్సలు ఊహించలేదు, బాల నటిగా మనకి తెలిసిన తెలుగు అమ్మాయి నిత్యా అద్భుతంగా నటించింది, బ్రహ్మాజీ గారు చాలా సీరియస్ రోల్ చేశారు. భవ్య క్రియేషన్స్ తో నాకు ‘శౌర్యం’ చిత్రం నుండి అనుబంధం ఉంది. ‘శౌర్యం’ చిత్రానికి నేను వర్క్ చేశాను . ఆనంద్ ప్రసాద్ గారికి ఈ చిత్రం తో మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి.

సాంకేతిక నిపుణులు: పాటలు: శ్రీజో , ఆర్ట్: వివేక్‌ అన్నామలై, ఎడిటర్‌: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.

Leave a comment

error: Content is protected !!