పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత దాదాపు రాజకీయాల కారణంగా రెండు సంవ్సరాలు సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు. ఎట్టకేలకు తన 26వ సినిమా ‘వకీల్ సాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. కరోనా కారణంగా విడుదల వాయిదా పడి.. అభిమానుల్ని నిరాశపరిచింది. అయితేనేం? పవర్ స్టార్ తన బర్త్ డే సందర్భంగా .. అభిమానులకు ఏకంగా నాలుగు  గిఫ్టులిచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

పవర్ స్టార్ బర్త్ డే నాడు విడుదలైన  వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ .. అభిమానులను ఎంతగానో అలరించింది.  నల్లకోటు ధరించిన పవన్ .. బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని ఒక స్టూల్ మీద కాలుపెట్టి సీరియస్ ఇచ్చిన పోజు .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అదే రోజు క్రిష్ దర్శకత్వంలో  తెరకెక్కబోతున్న పవన్ 27 వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ను పూర్తిగా చూపించకుండా .. ఆయన చొక్క వరకే  రివీల్ చేశారు. చారిత్రక నేపథ్యంలో పాన్ ఇండియా కేటగిరిలో రూపొందనున్న ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్టు టాక్.  

ఇక అదే రోజు వచ్చిన మరో ఫస్ట్ లుక్ పవర్ స్టార్ 28 వ సినిమాకి సంబంధించింది. ఈ సినిమా తో  హరీష్ శంకర్ పవన్ ను గతంలో గబ్బర్ సింగ్లో ఎలా అయితే చూపించాడో అలా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే… ఈ సినిమా కథాంశం సామాజిక సమస్యల నేపథ్యంలో ఉంటుందట. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీసేందుకు హరీష్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు ఉందా లేదా అంటూ అనుకున్న సురేందర్ రెడ్డి సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది. రామ్ తాళ్లూరి ఆ సినిమాను కన్ఫర్మ్ చేశాడు. స్టైలిష్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సూరి పవన్ 29ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మొత్తానికి ఈ నాలుగు సినిమాలు కూడా పూర్తిగా వేటికి అవే విభిన్నం అన్నట్లుగా ఉండబోతున్నాయి. కనుక ఫ్యాన్స్ కు ఈ నాలుగు సినిమాలతో ఫుల్ మీల్స్ ఖాయం. పైగా ఈ నాలుగు కూడా బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.

Leave a comment

error: Content is protected !!