Shopping Cart 0 items - $0.00 0

‘ఉప్పెన’ ఫస్ట్ వేవ్ లో తడిసిన వైష్ణవ్ తేజ

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ ‘ఉప్పెన’ మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 2న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను ఆల్రెడీ ప్రారంభించేశారు నిర్మాతలు. ప్రచారంలో భాగంగా మేకర్స్ ‘ఉప్పెన’ మూవీకి సంబంధించిన ఫస్ట్ వేవ్ ను విడుదల చేశారు. సాగర తీరం బ్యాక్ డ్రాప్ లో ఒక ఆసక్తికరమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందన్న సంగతి ఇందులో స్పష్టంగా రివీలైంది.

సముద్రం వైపుకు తిరిగి.. చేతులు పైకెత్తి ఆనందంగా అరుస్తూ వైష్ణవ్ తేజ రివీలవగా.. మరో పక్క కథానాయిక కృతీ శెట్టి కూడా కనిపించీ కనిపించనట్టుగా కనిపించి.. సినిమా మీద ఆసక్తిని పెంచింది.  తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. బుచ్చిబాబు సాన దర్శకుడు. నవీన్ ఎర్నేని,  రవి శంకర్ ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరి ‘ఉప్పెన’ తో వైష్ణవ్ తేజ ఏ స్థాయిలో బాక్సాఫీస్ ను ముంచెత్తుతాడో చూడాలి.

ఫస్ట్ వేవ్ వీడియో చూడ్డానికి కింది లింక్ పై క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=1&v=ZiNhfv0F4DY&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!