సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ల పుట్ట. పాజిటివ్ సెంటిమెంట్స్ ఎంతగా ఫాలో అవుతారో? నెగెటివ్ సెంటిమంట్స్ కూ అంతే పట్టింపు ఉంది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఓ పాజిటివ్ సెంటిమెంట్ గురించే లెండి. మేటర్లోకొస్తే .. దక్షిణాదినే కాకుండా.. యావత్తు భారతీయ తెరను తన సుమధుర సంగీతంతో ఓలలాడించిన మ్యూజిక్ గాడ్, మాస్ట్రో ఇళయరాజాకి ఓ విచిత్రమైన సెంటిమెంట్ ఉందట. దాని కథేంటంటే.. ఆయన మొట్టమొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించిన ‘అణ్ణక్కిళి’ సినిమా పాటల  రికార్డింగ్ జరుగుతుండగా.. ఒన్ టూ త్రీ అనడంతోనే .. ఠక్కున కరెంట్ పోయిందట.  మళ్ళీ కరెంట్ రాగానే రికార్డింగ్ కంటిన్యూ అయిందనుకోండి. అయితే ఆ సినిమా తమిళనాట సరిగ్గా 150రోజులు ఆడిందట. అప్పటినుంచీ ఇళయరాజా తన సినిమాలకు సంబంధించిన పాటల రికార్డింగ్ జరుగుతుంటే. కరెంట్ పోతే.. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం బలంగా పడిపోయిందట. అదీ సంగతి.

 

Leave a comment

error: Content is protected !!